ఎన్నో ఎళ్ల చరిత్ర ఉన్న హిందూ దేవాలయాలు సంప్రదాయాలకు పట్టగొమ్మలు. వివిధ శైలిలో రూపుదిద్దుకున్న శిల్పాలతో ద్రవిడ శైలిలో ఉండే మన దక్షిణ భారతదేశంలోనే అత్యంత అందమైన దేవాలయాలు ఏమిటో తెలుసుకుందాం.
విరూపాక్ష దేవాలయం
ఇది చారిత్రక నేపథ్యం ఉన్న దేవాలయం. దీనికి యూనెస్తో ప్రపంచవారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7 వ శతాబ్దంలో రాజావిక్రామాదిత్యుని విజయానికి చిహ్నంగా తుంగభద్ర నది తీరాన నిర్మించారు. ఇది హంపిలో ఉంది. విరూపాక్ష ఆలయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత అందమైన పుణ్యక్షేత్రంలో ఒకటి.
తిరుమల తిరుపతి దేవస్థానం
ఈ ఆలయాన్ని ద్రవిడ శైలిలో క్రీ.శ. 300వ శతాబ్దలో నిర్మించారు. దీనిని తిరుపతి బాలాజీ దేవాలయం అనికూడా పిలుస్తారు. కోరిన కోరికలు తీర్చే దైవమని భక్తుల్లో ప్రగాఢ విశ్వసముంది. ఈ దేవాలయానికి భారీ విరాలలు డబ్బు, ఆభరణాలు, బంగారం రూపేణా అందుతాయి. శ్రీవారు తన పెళ్లి కోసం కుబెరుడి వద్ద అప్పు తీసుకుంటాడని , అందుకు భక్తులు ఇచ్చే కానుకలను వడ్డీ రూపంలో తీసుకోవాలని కుబేరుడికి హామీ ఇస్తాడు.
మధుర మీనాక్షి
ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో నిర్మించారని తెలుస్తోంది. అనంతరం ముస్లిం రాజైన మాలిక్ కపూర్ మీనాక్షి ఆలయంలో నుంచి విలువైన వస్తువులను దొంగిలిస్తాడు. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో పునర్నిర్మించారు. శివపార్వతులకు అతిపెద్ద దేవాలయంగా ప్రఖ్యాతి పొందింది మధుర మీనాక్షి టెంపుల్.
రామనాథ స్వామి దేవాలయం
ఈ ఆలయం తమిళనాడులో 7,8 శతాబ్దాల్లో నిర్మించిన ఆలయం. శివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. రాముడు ఇక్కడ శివుడిని పూజించాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయం చూసేందుకు ఏటా వేల సంఖ్యలో భక్తుల హాజరవుతారు.
ఐహోలు
ఐహోలు, పట్టడక్కల్ దేవాలయం చాళుక్యుల రాజధానులు. ఇది రాతికట్టడం, ఎంతో ప్రసిద్దిగాంచింది. క్రీ.శ. 5 వ శతాబ్దనికి చెందినవి. ఈ ఆలయాన్ని హిందూ వాస్తుశిల్పానికి ఊయల అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో దుర్గా మాత కొలువైంది. అలాగే మళ్లిఖార్జున దేవాలయం, సంగమేశ్వర ఆలయంతో పాటు ఇతర ఆలయాలు ఉన్నాయి.
తనుమాలయన్ ఆలయం
దీనిని సుచింద్ర ఆలయం అనికూడా అంటారు. కన్యాకుమారిలో ఉండే ఈ ఆలయం 1300 ఏళ్ల నాటిది. అనసూయ, అహల్యల ఇతిహాసాలను ప్రతిబింబిస్తుంది. అత్యంత పురాతనమైన ఈ దేవాలయం ఆకర్షణీయంగా ఉంటుంది.
రంగనాథ స్వామి దేవాలయం
ఈ హిందూ దేవాలయం ఎంతో ప్రత్యేకమైంది. 156 ఎకరాల్లో విస్తరించి ఉంది. శ్రీ రంగనా««థ స్వామి ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంలో ఇది ఒకటి. ఈ ఆలయ దర్శనార్ధం ఏటా వేల సంఖ్యంలో
ఐరావతేశ్వర ఆలయం
తమిళనాడు తంజావూరులో ఉంది ఈ ఆలయం. ఈ ఆలయ మెట్లు సంగీతాన్ని వినిపిస్తాయి. పరమశివుని పూజలందుకునే ఈ ఆలయం 12వ శతాబ్దంలో రెండో రాజరాజ చోళుడు నిర్మించాడు. ప్రపంచ వారసత్వ స్మారకంగా యూ¯ð స్కో ఈ ఆలయాన్ని గుర్తించింది. రాళ్లతో చేసిన మెట్లను తడితే ఏడు రకాల శబ్దాలు రావడం ఆలయ ప్రత్యేకత.
తంజావూరు బృహదీశరాలయం
అద్భుతమైన శిల్పకళతో నిర్మితమైన ఈ ఆలయం గ్రానైట్ రాయితో తీర్చిదిద్దారు. ఆలయ గోపురాన్ని 80 టన్నుల ఏకరాతి గ్రానైట్ శిలపై నిర్మించినట్లు చెబుతారు. ఏకశిలారాతిని తరలించడం అసాధ్యం. ఈ ఆలయ నిర్మాణ మర్మాన్ని కనుగొనలేకపోయారు.
శ్రీ విజయవిట్టల దేవాలయం
హంపీలో కొలువైంది ఈ ఆలయం. 15 వ శతాబ్దంలో దీనిని నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతారు. 56 సంగీత స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలపై కొట్టినపుడు డో–రె–మి–స సంగీత స్వరాలు వినిపిస్తాయి.
భక్తుల వస్తారు.