ఈరోజు వైకుంఠ ఏకాదశి: పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!

-

ముక్కోటి ఏకాదశి అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు, ఉత్తర ద్వారం గుండా ఆ వైకుంఠ వాసుని దర్శించుకుని జన్మ ధన్యం చేసుకోవాల్సిన పవిత్ర గడియలు. ఈ రోజు చేసే చిన్న పుణ్యకార్యమైనా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అయితే, తెలియక చేసే కొన్ని పొరపాట్లు ఆ స్వామి ఆగ్రహానికి కారణం కావచ్చు. అందుకే ఈనాటి పవిత్ర దినాన స్త్రీలు, పురుషులు పొరపాటున కూడా ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం.

వైకుంఠ ఏకాదశి నియమాలు: వైకుంఠ ఏకాదశి నాడు సాక్షాత్తూ విష్ణుమూర్తి వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. రేపు అనగా డిసెంబర్ 30 వ తేదీన వైకుంఠ ఏకాదశి జరుపుకుంటారు. ఈరోజు ఉదయం నుండి “ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని జపిస్తూ, నియమాలను పాటిస్తే ఆ శ్రీహరి అనుగ్రహం మనపై సదా ఉంటుంది. ఇంతటి పవిత్రమైన రోజున మనం పాటించకూడని నియమాలు తెలుసుకుందాం..

Vaikuntha Ekadashi Warning: Things You Should Never Do on This Sacred Day
Vaikuntha Ekadashi Warning: Things You Should Never Do on This Sacred Day

అన్న పానీయాల నియమం: ఏకాదశి తిథి నాడు బియ్యంతో చేసిన పదార్థాలు (అన్నం) అస్సలు తీసుకోకూడదు. పురాణాల ప్రకారం, ఈ రోజున పాప పురుషుడు బియ్యంలో నివసిస్తాడని నమ్ముతారు. కేవలం పండ్లు, పాలు లేదా లఘు ఫలహారం తీసుకోవడం ఉత్తమం. అసలు ఏమీ తినకుండా ‘నిరాహార’ ఉపవాసం ఉండటం అత్యంత శ్రేష్టం.

తులసి దళాలను తుంచకూడదు: వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రియమైన తులసి కోటను పూజించాలి. కానీ, ఆ రోజే స్వయంగా తులసి ఆకులను చెట్టు నుండి తుంచకూడదు. పూజకు కావాల్సిన దళాలను ఒక రోజు ముందే కోసి పెట్టుకోవాలి.

నిద్రకు దూరంగా ఉండాలి: ఈ పవిత్ర దినాన పగలు నిద్రపోవడం నిషిద్ధం. రాత్రి వేళ ‘జాగరణ’ చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ లేదా గోవింద నామ స్మరణ చేయాలి. నిద్రపోవడం వల్ల వ్రత ఫలితం దక్కదని పెద్దలు చెబుతారు.

కోపతాపాలు, హింసకు దూరం: ఈ రోజున ఎవరినీ దూషించకూడదు, అబద్ధాలు ఆడకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇంటికి వచ్చిన అతిథులను లేదా యాచకులను ఖాళీ చేతులతో పంపకూడదు. కనీసం తాంబూలమైనా ఇవ్వడం శుభప్రదం.

పరిశుభ్రత పాటించాలి: శుచి, శుభ్రత లేని చోట లక్ష్మీదేవి నిలవదు. కాబట్టి ఇల్లు, ఒళ్లు శుభ్రంగా ఉంచుకుని, ఉదయాన్నే తలారా స్నానం చేసి తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news