రోజంతా పని ఒత్తిడిలో పడి మన ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేస్తుంటాం. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడం పెద్ద సవాలుగా మారుతుంది. అయితే రాత్రి భోజనం తర్వాత లేదా పడుకునే ముందు కేవలం 10 నిమిషాల పాటు ఈ 3 ప్రత్యేక యోగా ఆసనాలు వేస్తే, మీ శరీరం రాకెట్ వేగంతో క్యాలరీలను ఖర్చు చేస్తుంది. జిమ్‌కు వెళ్లే సమయం లేని వారికి ఇది ఒక అద్భుతమైన మార్గం.
రాత్రి వేళల్లో కొవ్వును కరిగించే 3 శక్తివంతమైన ఆసనాలు: రాత్రి 8 గంటల తర్వాత మన శరీరం విశ్రాంతి స్థితికి చేరుకుంటుంది. ఆ సమయంలో జీవక్రియను (Metabolism) ప్రేరేపించే ఈ ఆసనాలు ఫ్యాట్ బర్నింగ్‌కు ఎంతో తోడ్పడతాయి:
వజ్రాసనం : రాత్రి భోజనం చేసిన తర్వాత వేయదగ్గ ఏకైక ఆసనం ఇది.ఎలా చేయాలి: మోకాళ్లపై కూర్చుని మడమలపై పిరుదులు ఉంచి, వెన్నుముక తిన్నగా ఉంచాలి. దీని ప్రయోజనం చుస్తే,ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఉబ్బరం తగ్గించి పొట్ట భాగంలో రక్త ప్రసరణను పెంచుతుంది. తద్వారా పొట్ట కొవ్వు త్వరగా కరుగుతుంది.

విపరీత కరణి, ఎలా చేయాలి: గోడకు ఆనుకుని పడుకుని, కాళ్లను గోడపై నిలువుగా 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. దీని ప్రయోజనంచూస్తే, ఇది రోజంతా కాళ్లపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజితం చేయడం ద్వారా మెటబాలిజం రేటును పెంచుతుంది ఇది బరువు తగ్గడానికి కీలకమైన అంశం.
బాలాసనం, ఎలా చేయాలి: వజ్రాసనంలో కూర్చుని నెమ్మదిగా ముందుకు వంగి నుదురును నేలకు ఆనించాలి. చేతులను వెనక్కి లేదా ముందుకు చాపి ఉంచాలి. దీని ప్రయోజనం చూస్తే, ఇది ఒత్తిడిని కలిగించే ‘కార్టిసోల్’ హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. ఒత్తిడి తక్కువగా ఉంటేనే శరీరం కొవ్వును వేగంగా కరిగిస్తుంది. ఇది గాఢ నిద్రకు కూడా దోహదపడుతుంది.
ఈ అలవాట్లకు దూరంగా ఉండండి బరువు తగ్గాలనుకునే వారు రాత్రి వేళల్లో ఈ తప్పులు అస్సలు చేయకూడదు
లేట్ నైట్ స్నాక్స్: భోజనం తర్వాత మళ్ళీ చిరుతిళ్లు తినడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరిగి కొవ్వు పేరుకుపోతుంది. స్క్రీన్ టైమ్: పడుకునే ముందు ఫోన్ చూడటం వల్ల నిద్రలేమి ఏర్పడుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే శరీరంలో మెటబాలిజం మందగిస్తుంది. కెఫైన్: రాత్రి 8 తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది.
గమనిక: ఏదైనా ఆరోగ్య సమస్యలు లేదా వెన్నునొప్పి ఉన్నవారు నిపుణుల సలహాతోనే ఈ ఆసనాలు వేయాలి. భోజనం చేసిన వెంటనే వజ్రాసనం వేయవచ్చు, కానీ మిగిలిన ఆసనాలకు కనీసం 2 గంటల వ్యవధి ఉండటం మంచిది.
