ఈ తప్పుల్ని మీ ఇంట్లో చేస్తున్నారా..? అయితే దరిద్రం ఇంట్లోనే ఉంటుంది..!

-

వాస్తు ప్రకారం అనుసరించారు అంటే ఎలాంటి ఇబ్బందులు కలగవు. కానీ నిజానికి చాలా మందికి వాస్తు గురించి అంతగా అవగాహన లేదు. ఈరోజు వాస్తు పండితులు ఇంట్లో దక్షిణ దిశలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు. ఒకవేళ కనుక వీటిని అనుసరించక పోతే దరిద్రం మీ ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది.

 

కాబట్టి దక్షిణ దిశలో పాటించాల్సిన విషయాలు గురించి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఇవి అస్సలు దక్షిణ దిశలో ఉండకూడదని వాస్తు పండితులు చెప్పారు. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా వాటికోసం చూసేద్దాం.

దక్షిణ దిశలో నీటి నిల్వలు:

ఇంటి లోపల కానీ బయట కానీ దక్షిణ దిశలో నీరు నిల్వ ఉండకూడదు. అంటే బాత్రూం, గార్డెన్ లేదా స్విమ్మింగ్ పూల్ వంటివి దక్షిణం వైపు ఉండకూడదు. ఇవి కనుక ఉన్నాయంటే మీ ఇంట్లో దరిద్రం చేరినట్లే.

దక్షిణ దిశలో బెడ్ రూమ్:

దక్షిణ దిశలో బెడ్రూమ్ ఉండడం వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. అలానే అనారోగ్య సమస్యలు తీసుకువస్తుంది. కాబట్టి దక్షిణ దిశలో బెడ్ రూమ్ కూడా ఉండకుండా చూసుకోండి.

దక్షిణ దిశలో పూజగది:

పూజ గది కూడా ఎప్పుడూ దక్షిణ దిశలో ఉండకూడదు. ఈ దిక్కున కూర్చుని పూజ చేయడం వల్ల పూర్తి ఫలితాలు కూడా పొందడం అవ్వదు.

దక్షిణ దిశలో వంటగది:

దక్షిణ దిశలో వంట గది ఉండడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి ఆహారం వండడం లో తినడం లో కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూశారు కదా దక్షిణ దిశలో వేటిని ఉంచడం వల్ల ఇంట్లో దరిద్రం కలుగుతుంది అనేది. మరి ఈ తప్పులు ఇంట్లో జరగకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా మీరే నష్టపోతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version