ఉత్తర దిశలో కుబేరుడు ఉంటాడు.. ఈ పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు..!

-

చాలా శాతం మంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుంటారు మరియు ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటారు. కాకపోతే నిర్మాణం పూర్తి అయిన తర్వాత కూడా ఇంట్లో ఉపయోగించే వస్తువులను కూడా సరైన దిశలో పెట్టాలి. పైగా వాటిని సరైన దిశలో పెట్టకపోవడం వలన ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పిన నియమాలను కచ్చితంగా పాటించండి, దీంతో మీ ఇంట్లోకి సానుకూల శక్తి ఉంటుంది.

సహజంగా ఉత్తర దిశలో కుబేరుడు ఉంటాడు. అందువలన ఉత్తర దిశలో కొన్ని వస్తువులను పెట్టడం వలన ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. బరువైన ఫర్నిచర్ వంటివి ఉత్తర దిశలో అస్సలు ఉంచకూడదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే ఉత్తర దిశలో గాలి, వెళ్తురు బాగుంటుందో అప్పుడు సానుకూల శక్తి ఉంటుంది. దీంతో ఎంతో ఆనందంగా జీవించవచ్చు. అదేవిధంగా చెత్త బుట్టను కూడా ఉత్తర దిశలో అసలు పెట్టకూడదు. ఎప్పుడైతే చెత్తబుట్ట వంటివి ఉత్తర దిశలో పెడతారో ఆర్థికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటితో పాటుగా పాడైపోయిన మరియు పనికిరాని వస్తువులను ఉత్తర దిశలో పెట్టకూడదు.

పనికిరాని వస్తువులను ఉత్తర దశలో పెట్టడం వలన ఎన్నో దోషాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మరియు ఇబ్బందిపడాల్సి ఉంటుంది అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. బాత్రూం లేక టాయిలెట్స్ వంటివి ఉత్తర దిశలో నిర్మించడం వలన ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు దోషాల నుండి బయటపడాలి అంటే గాజు కప్పులో ఉప్పు వేసి బాత్రూం కార్నర్ లో పెట్టాలి. ఇలా ప్రతి వారం ఉప్పును మారుస్తూ ఉంచాలి. దీంతో ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కుబేరుడు ఉండేటువంటి ఉత్తర దిశలో షూ లేక చెప్పులని ఉంచడం వలన సంపద తగ్గిపోతుంది. కనుక చెప్పులు వంటివి ఉత్తర దశలో అస్సలు పెట్టకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news