పిఠాపురం వేదిక గా జనసేన పార్టీ ఘనంగా నిర్వహించనున్న 12వ ఆవిర్భావ సభకు మహిళలను పెద్ద ఎత్తున ఆహ్వానించేందుకు వినూత్న కార్యక్రమానికి పార్టీ శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఆడపడుచులను ఆహ్వానించేలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన బొట్టు స్టిక్కర్లతో కూడిన ఆహ్వాన పత్రికను ఆదివారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కాకినాడ కంట్రోల్ రూమ్ లో ఆవిష్కరించారు. పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపున ఆడపడుచులను ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి సభకు ఆహ్వానించనున్నారు.
ఈ మేరకు చొరవ తీసుకోవాలని పార్టీ వీర మహిళా విభాగానికి మనోహర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వం విప్ పిడుగు హరి ప్రసాద్ కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ, మాజీ మంత్రి పడాల అరుణ, మాజీ శాసన సభ్యులు పెండెం దొరబాబు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వీ, పార్టీ నాయకురాలు రావి సౌజన్య పాల్గొన్నారు.