ఇంట్లో వాస్తు నియమాలను పాటించడం వల్ల ఎంతో మార్పు వస్తుంది. ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాలను ఎప్పుడైతే కచ్చితంగా పాటిస్తారో, ఎలాంటి సమస్యలు లేకుండా ఎంతో ఆనందంగా జీవించగలుగుతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు. ఎటువంటి వాస్తు దోషాలను ఎదుర్కొకుండా మంచి జీవితాన్ని పొందాలంటే, ఈ తప్పులను అస్సలు చేయకూడదు. ముఖ్యంగా చాలా శాతం మంది ఉపయోగించని వస్తువులను ఇంట్లో పెడుతూ ఉంటారు. అటువంటి అనవసరమైన వస్తువులను ఇంట్లో అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే వాటి వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది.
అంతేకాకుండా కొన్ని దిశల్లో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల కూడా మరింత ప్రతికూల శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే, ఈ వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి. పూజ గదిలో ఉండే దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు పాడైనట్లయితే, వాటిని ఇంట్లో అస్సలు ఉంచకూడదు. వాటి వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సహజంగా, ఇంట్లో ఉపయోగించని తాళాలు ఎక్కువగా ఉంటాయి. అలా చేయడం వలన జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కనుక, పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచకపోవడమే మేలు.
ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే, అనవసరమైన వస్తువులను ఇంట్లో నుంచి తొలగించాలి. వీటితో పాటుగా పాడైన టీవీలు, గడియారాలు, ఇనుప పెట్టెలు, పాత పెన్నులు వంటివి కూడా ఇంట్లో ఉండకుండా తీసివేయాలి. సాధారణంగా, ఇంట్లో అనవసరమైన వస్తువులను తొలగించకుండా ఇంటి పైకప్పుపై పెడుతూ ఉంటారు. అయితే వాటి వల్ల జీవితంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడతాయి. అందుకే ఈ పొరపాట్లను అస్సలు చేయకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. కనుక ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా ఎంతో సంతోషంగా జీవించగలుగుతారు.