చాలా శాతం మంది సరైన నిద్ర లేకపోవడంతో ఎంతో బాధపడుతూ ఉంటారు. అయితే సహజంగా నిద్ర లేకపోవడానికి కారణం ఒత్తిడి అయినా సరే కొన్ని సందర్భాలలో వాస్తూ దోషాలు కూడా కావచ్చు. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడడం వలన ఇలాంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు నిద్ర సమస్యలు ఉంటే కనుక కేవలం కొన్ని మార్పులను చేయడం వలన మంచి నిద్రను పొందవచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పిన విషయాలను పాటించడం వలన ఎన్నో దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది. వాస్తు దోషాలు తగ్గడం వలన మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కనుక వాస్తు శాస్త్రంలో చెప్పిన చిట్కాలను పాటించి ఎన్నో ప్రయోజనాలను మీరు పొందవచ్చు. ఈ వాస్తు శాస్త్రంలో చెప్పిన నివారణలు చేసి మంచి నిద్రను పొందవచ్చు. మీరు పడుకునే రూమ్ లో అద్దం పెట్టకూడదు. బెడ్ రూమ్ లో అద్దం ఉండడం వలన సరైన నిద్రను పొందలేరు. ఒకవేళ మీరు పడుకునే ప్రదేశంలో అద్దం ఉన్నట్లయితే ఏదైనా క్లాత్ ఉపయోగించి దానిని మూసివేసి ఆ తర్వాత పడుకోవాలి. ఇలా చేయడం వలన మంచి నిద్రను పొందవచ్చు.
అంతే కాకుండా బెడ్ రూమ్ లో చీపురు కట్టను అస్సలు పెట్టకూడదు అని గుర్తుంచుకోండి. బెడ్ రూమ్ లో టీవీ, కంప్యూటర్ వంటి మొదలైన ఎలక్ట్రానిక్ వస్తువులను అస్సలు ఉంచకూడదు. వీటి వలన కూడా నిద్ర సమస్య ఏర్పడుతుంది. మంచి నిద్రను పొందడానికి ఏ దిక్కులో పడుకుంటున్నారు అనేది కూడా ఎంతో అవసరం. మంచం ఎప్పుడూ ఈశాన్యం వైపు లో ఉండకూడదు. ఇలా ఉండడం వలన నిద్ర సమస్య ఏర్పడుతుంది. ఎన్నో మార్పులను చేసినా సరైనా నిద్ర ను పొందకపోతే స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించి బెడ్ రూమ్ లో దీపాన్ని వెలిగించండి. ఈ విధమైన మార్పులను చేయడం వలన మంచి నిద్రను పొందవచ్చు.