హీరో బాలకృష్ణ ఇంటికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!

-

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. కళారంగంలో అందించిన సేవలకు గాను బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. అయితే బాలయ్యకు అవార్డు రావడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బాలకృష్ణను నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం బాలకృష్ణను శాలువాతో సన్మానించారు కిషన్ రెడ్డి. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. 

ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్ అవార్డు ప్రకటించడం తో ఇప్పటికే పలువురు సీని ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ఉదయం నుంచే బాలయ్య నివాసంలో అభిమానుల సందడి నెలకొంది. అభిమానుల కోలాహలం సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కొందరూ పోలీసులు అక్కడే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news