చాలా శాతం మంది ఎంతో కష్టపడుతూ ఉంటారు. కాకపోతే విజయాన్ని సాధించకపోవడం వలన ఎంతో బాధపడతారు. విజయాన్ని సాధించడం అంత సులువు కాదు. కాకపోతే కొన్ని పరిహారాలను చేయడం వలన జీవితంలో విజయాన్ని పొందవచ్చు. వ్యాపారం, ఉద్యోగం ఎలాంటి రంగానికి సంబంధించి అయినా సరే విజయాన్ని పొందాలంటే ఈ పరిహారాలను ప్రయత్నించాల్సిందే. వీటి వలన ప్రమోషన్ లు రావడం, వ్యాపారంలో వృద్ధి చెందడం వంటివి పొందవచ్చు. చాలా శాతం మంది చెడు దృష్టిని నమ్ముతూ ఉంటారు. ఎప్పుడైతే చెడు దృష్టి తొలగిపోతుందో కచ్చితంగా విజయాన్ని పొందుతారు.
చెడు దృష్టి తగ్గాలంటే నిమ్మకాయ ఎంతో సహాయం చేస్తుంది. ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయకి నాలుగు లవంగాలు గుచ్చాలి. ఇలా చేసిన తర్వాత ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ విధంగా పాటించడం వలన ఎంతో సులభంగా విజయాన్ని పొందవచ్చు. అంతేకాకుండా జీవితంలో ఉండే కష్టాలను తగ్గించుకొని విజయాన్ని పొందాలి అని అనుకుంటే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఒక చపాతీని కాకులకు పెట్టాలి. ఇలా చేస్తే మీరు అనుకున్న పనులు అన్ని పూర్తి అవుతాయి మరియు ఎటువంటి ఆటంకం కలగదు. ఎప్పుడైతే శని, రాహువు, కేతువు వంటి దోషాలతో బాధపడతారో మీరు అనుకునేటువంటి పనులు పూర్తి అవ్వవు.
కనుక అటువంటి దోషాలు తగ్గాలంటే కచ్చితంగా పక్షులకు ఏడు గింజలను ఆహారంగా పెట్టాలి. ఇలా పక్షులకు గింజలను పెట్టడం వలన మీ పనులు ఎంతో త్వరగా పూర్తి అవుతాయి. మీ పనులు పూర్తి అవ్వకుండా ఉన్నట్లయితే ఇంటి నుండి పని కు సంబంధించి బయటకు వెళ్తున్నప్పుడు నల్ల మిరియాలను గడప మీద వేసి వాటిని దాటి బయటకు వెళ్లాలి. ఇలా చేయడం వలన మీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. దాంతో ఎంతో ఆనందంగా జీవించవచ్చు. అంతేకాకుండా ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో వినాయకుడిని తీసుకువెళ్లడం వలన పనిలో ఎదుర్కొనేటువంటి ఆటంకాలు తొలగిపోతాయి.