కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలంటే.. వీటిని తప్పక పాటించాల్సిందే..!

-

ఎప్పుడైతే ఇంట్లో సానుకూల శక్తి ఉంటుందో ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా జీవిస్తారు. ముఖ్యంగా ఎన్నో ఇబ్బందుల నుండి బయటపడతారు. ఇంటిని నిర్మించిన సమయం దగ్గర నుండి పూర్తి అయిన తర్వాత కూడా వాస్తు శాస్త్రాన్ని చాలామంది పాటిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను పాటిస్తారో ఎంతో ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా వాస్తు నిపుణులు చెప్పినటువంటి సలహాలను తీసుకుంటే కచ్చితంగా ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తగ్గుతుంది. దీంతో ఎంతో ఆనందంగా జీవించవచ్చు. ఇంట్లో పెట్టే ప్రతి వస్తువుకి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలను చెప్పడం జరిగింది.

కనుక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సామాన్లను పెట్టడం వలన ఎన్నో నష్టాలు తొలగిపోతాయి. అయితే మీ ఇంట్లో ఉండేటువంటి సోఫాను దక్షిణ లేక పడమర గోడకు వ్యతిరేకంగా ఉంచాలి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కనుక సోఫాను ఉత్తరం లేక తూర్పు వైపు ఫేస్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా దృఢంగా మారుతారు. కనుక దీనిని తప్పకుండా పాటించితే మేలు. కేవలం దిశ మాత్రమే కాకుండా సోఫా రంగులు కూడా ప్రతికూల శక్తిని తీసుకొస్తాయి.

ముఖ్యంగా ముదురు రంగులో ఉండేటువంటి సోఫాలు వలన ప్రతికూల శక్తి పెరుగుతుంది. కనుక లివింగ్ రూమ్ లో ముదురు రంగుల సోఫాలను పెట్టకపోవడమే మేలు. అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే లెదర్ సోఫాలను లివింగ్ రూమ్ లో పెడతారో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. చాలా మంది లెదర్ సోఫాలను ఇష్టపడతారు. కాకపోతే వాటిని లివింగ్ రూమ్ లో పెడితే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కనుక లెదర్ సోఫాలను పెట్టకపోవడమే మేలు. ఈ విధమైన మార్పులను మీ ఇంట్లో చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. కనుక వీటిని తప్పకుండా పాటిస్తే సానుకూల శక్తిని పొంది ఎంతో సంతోషంగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news