ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలి : మంత్రి పొంగులేటి

-

పైలట్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు తక్షణం చెల్లింపులు జరపాలని వరంగల్ జిల్లా ఇన్ ఛార్జి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వరంగల్ స్మార్ట్ సిటీ పనులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తాగునీరు, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్ష నిర్వహించారు.


ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా శాసనసభ్యులు, కలెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశమని దీనిని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లు పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ప్రభుత్వం నాలుగు విడతలలో చెల్లింపులు చేస్తుందని, మొదటి విడతలో బేస్ మెంట్ లెవెల్ పూర్తవగానే లక్ష రూపాయిలు ఇస్తుందని అన్నారు. బేస్ మెంట్ పూర్తయిన ఇండ్ల వివరాలను హౌసింగ్ విభాగానికి పంపిస్తే తక్షణమే చెల్లింపులు చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news