ఆర్థికంగా దృఢంగా ఉండాలంటే.. ఈ పొరపాట్లను అస్సలు చేయకూడదు..!

-

ఇంట్లో ఎప్పుడూ కూడా సానుకూల శక్తి ఎక్కువగా ప్రవహించాలి. ఎప్పుడైతే ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుందో ఇంట్లో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఇంట్లో వస్తువులను సరైన దిశలో పెట్టాలి. పైగా అటువంటి చిన్న పొరపాట్లే ఎన్నో ఇబ్బందులను తీసుకొస్తాయి. ముఖ్యంగా చాలా శాతం మంది చెప్పులను విడిచి పెట్టే సమయంలో ఎన్నో పొరపాట్లను చేస్తూ ఉంటారు. కనుక చెప్పులను విడిచి పెట్టడానికి తగిన నియమాలను తప్పకుండా పాటించాలి. ఎలా అయితే ఇంట్లోకి ముఖ ద్వారం నుండి అందరూ లోపాలకి వెళ్తారో అదేవిధంగా దేవతలు కూడా ముఖద్వారం నుండే వస్తారు అని పురాణాలు చెబుతున్నాయి.

కనుక ఎప్పుడైతే ముఖ ద్వారం అందంగా ఉంటుందో దేవతల అనుగ్రహాన్ని ఎంతో పొందవచ్చు. ముఖ్యంగా ఇంటి ముఖద్వారం ముందుగా షూ మరియు చెప్పులను అస్సలు విడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే ఇంటిముందు షూ, చెప్పులు వంటివి ఉంటాయో లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. ఈ విధంగా డబ్బులకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతాయి. కనుక ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా జీవించాలంటే ఎట్టి పరిస్థితుల్లో షూ మరియు చెప్పులను ముఖద్వారం దగ్గర పెట్టకూడదు. అంతేకాకుండా ముఖద్వారం దగ్గర రాహువు ఉంటాడు అని పండితులు చెబుతున్నారు.

కనుక ఇంటి ముఖ ద్వారం దగ్గరలో ఎంతో శుభ్రతను పాటించాలి. ముఖ్యంగా అనవసరమైన వస్తువులు, షూ, చెప్పులు వంటివి ముఖద్వారం దగ్గర ఉంచడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక షూ రాక్ వంటివి ఏర్పాటు చేసుకొని సరైన విధంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన ఎంతో అందంగా ఉండడంతో పాటుగా దేవతల అనుగ్రహం కూడా పొందవచ్చు. దీంతో ఎటువంటి సమస్యలు లేకుండా జీవితాంతం ఎంతో సంతోషంగా ఉంటారు. కనుక ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను అస్సలు చెయ్యకండి.

Read more RELATED
Recommended to you

Latest news