వాస్తు: ఇంట్లో ఈ వస్తువులు ఉంటే ఆర్ధిక ఇబ్బందులే..!

-

మన ఇంట్లో తరచూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అయితే సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలని పాటించాలి. ఈరోజు పండితులతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. మరి వాటి కోసం చూసేద్దాం. వాస్తు ప్రకారం ఇంట్లో ముళ్ళ మొక్కలు ఉండకూడదు. ముళ్ళ మొక్కలు ఉండడం వల్ల ఇంట్లో ఇబ్బందులు వస్తాయి.

ముఖ్యంగా ఇది దాంపత్య జీవితంపై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి. అదే విధంగా విరిగిపోయిన పగిలిపోయిన కప్పులలో కానీ ప్లేట్లలో కానీ ఏమి తినకూడదు. అలా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు దీని వల్ల కలుగుతాయి. బెడ్ రూమ్ లో టీవీని పెట్టుకునేటప్పుడు ఆగ్నేయం వైపు పెట్టుకోవడం మంచిది.

ఎప్పుడు కూడా టీవీని బెడ్ రూమ్ కి మధ్యలో పెట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి. అలానే మనం చాలా మొక్కలు ఇంట్లో పెంచుతూ ఉంటాము. ఎప్పుడూ కూడా మొక్కలు ఎండిపోకూడదు. ఇలా అవి ఎండిపోకుండా చూసుకోవాలి. పచ్చగా ఎప్పుడు మొక్కలు ఉండాలి. అంతే కానీ అవి ఎండి పోకూడదు అవి ఎండిపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news