పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందంగా హోలీ పండుగను జరుపుకుంటారు.హోలీ పండుగ రోజున రంగులు చల్లుకొని ఎంతో ఆనందంగా గడుపుతారు. కాకపోతే హోలీలో ఉపయోగించే రంగులు అన్నీ రసాయనాలతో తయారుచేస్తారు. దాని వలన చర్మ ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుని చర్మానికి సంరక్షణ చేయడం వలన చర్మ ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుంది. సింథటిక్ రంగులను ఉపయోగించడం వలన చర్మం ఎంతో పొడిబారుతుంది దీంతో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. రంగులలో ఉపయోగించే రసాయనాల ప్రభావం నుండి దూరంగా ఉండాలంటే తప్పకుండా మాయిశ్చరైజర్ ను ఉపయోగించాలి.
హోలీ వేడుకల్లో పాల్గొనే ముందు చర్మం పై మాయిశ్చరైజర్ ను తప్పకుండా రాసుకోవాలి. దీనికి బదులుగా కొబ్బరి నూనె లేక బాదం నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వలన చర్మం పొడిబారకుండా ఉంటుంది. దీంతో ఎలాంటి రసాయనాలు చర్మం లోనికి చేరకుండా ఉంటాయి. సహజంగా హోలీ పండుగను ఇంటి బయట ఖాళీ ప్రదేశాలలో జరుపుకుంటారు. కనుక సూర్యరశ్మి వలన చర్మానికి హాని కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక హోలీ పండుగను జరుపుకునే ముందు తప్పకుండా సన్ స్క్రీన్ ను ఉపయోగించాలి. కనీసం ఎస్పీఎఫ్ 30 ఉండేటువంటి సన్ స్క్రీన్ ను ఉపయోగించడం వలన యూవీ కిరణాలు నుండి కాపాడుకోవచ్చు.
కేవలం చర్మానికి సంరక్షణ తీసుకోవడంతో పాటుగా పెదాలకు కూడా లిప్ బామ్ లేక లిప్ మాస్క్ వంటివి ఉపయోగించాలి. పెదాలు పొడిబారకుండా మరియు మరకలు పడకుండా ఉండాలంటే తప్పకుండా లిప్ బామ్ ను ఉపయోగించాలి. వీటన్నిటితో పాటుగా జుట్టుకు కూడా తగిన రక్షణ తీసుకోవాలి. హానికరమైన రసాయనాల వలన జుట్టు పొడిబారుతుంది. కనుక ముందుగానే నూనె ను రాయడం వలన జుట్టుకు రక్షణ కలుగుతుంది మరియు తర్వాత రంగులను కూడా సులభంగా కడుక్కోవచ్చు. కనుక హోలీ వేడుకను ప్రారంభించే ముందే కొబ్బరి నూనె లేక ఆలివ్ నూనెను తలకు రాసుకోవాలి.