బాలాపూర్ ల‌డ్డూ వేలం స‌రికొత్త రికార్డు క్రియేట్ చేస్తుందా..!

-

జాతీయ… అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్లోని బాలాపూర్ వినాయకుడు లడ్డు వేలం ఎన్నోసార్లు రికార్డులు బద్దలు కొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల వినాయక లడ్డూలు వేలం వేస్తుంటారు. బాలాపూర్ లడ్డూ వేలంకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ లడ్డూ వేలం పాటలో సొంతం చేసుకునేందుకు చాలా మంది పోటీ పడుతుంటారు. ఈ లడ్డూ వేలం వందల నుంచి మొదలై వేలలు దాటేసి ల‌క్ష‌ల్లోకి వెళ్లిపోతుంది. ప్రతి ఏడాది బాలాపూర్ లడ్డు గత ఏడాది కంటే ఎక్కువ రేటుకు వేలంలో ఎవరో ఒకరు సొంతం చేసుకుంటూ వస్తుండటం ఆనవాయితీగా మారింది.

ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరానికి ధ‌ర‌ పెరుగుతూ వచ్చింది. గ‌తేడాది ఈ ల‌డ్డూను బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా రూ. 16.60 ల‌క్ష‌ల‌కు సొంతం చేసుకున్నారు.  2017లో నాగం తిరుపతి రెడ్డి రూ. 15.60 ల‌క్ష‌ల‌కు సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూ వేలం తొలిసారిగా 1994లో ప్రారంభమైంది. కొలను మోహన్ రెడ్డి రూ. 450కి వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూ బాగా ప్రాచుర్యం పొందింది. అప్ప‌టి నుంచి ప్ర‌తి యేడాదికి రేటు పెరిగిపోతూ వ‌స్తోంది.


వేలంలో పాడుకున్న వారు ఈ లడ్డూను అపురూపంగా భావిస్తుంటారు. పొలాల్లో చల్లితే పంట బాగా పండుతుందనే నమ్మకం..మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. కొన్ని రోజుల వ‌ర‌కు కేవ‌లం స్థానికుల‌కే ఈ ల‌డ్డూను వేలంలో సొంతం చేసుకునే అవ‌కాశం ఇచ్చిన నిర్వాహ‌కులు ఆ త‌ర్వాత ఎవ‌రైనా ఈ ల‌డ్డూ వేలంలో పాడుకోవ‌చ్చ‌న్న ఛాన్స్ ఇచ్చారు. ఈ ల‌డ్డూను చాలా సార్లు సొంతం చేసుకున్న ఘ‌న‌త కొల‌ను కుటుంబాల వాళ్ల‌కే ద‌క్కింది.

ప్ర‌తి యేటా రూ.50 వేలు లేదా రూ.ల‌క్ష మాత్ర‌మే ధ‌ర పెరుగుతూ రాగా 2016లో మాత్రం స్కైలాబ్ రెడ్డి ఏకంగా అంత‌కు ముందు యేడాదితో పోలిస్తే రూ.4 ల‌క్ష‌ల‌కు అద‌నంగా పాడారు. ఈ క్ర‌మంలోనే ఈ యేడాది కూడా బాలాపూర్ ల‌డ్డూ స‌రికొత్త రికార్డు క్రియేట్ చేస్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news