హిందూ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన ఇతిహాసాల లో మహాభారతం ఒకటి. ఇందులో శ్రీకృష్ణుడు ధర్మస్థాపనకు పాండవుల విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఈ ఇతిహాసంలో గాంధారి ఇచ్చిన శాపం శ్రీకృష్ణుని జీవితంలోనే కాక యాదవ వంశం భవిష్యత్తును కూడ మలుపు తిప్పిన సంఘటనగా నిలిచింది. మరి గాంధారి శాపం వెనక ఉన్న సంఘటన దాని ప్రభావం శ్రీకృష్ణుని జీవితంలో శాపం యొక్క ప్రాముఖ్యత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
గాంధారి శాపం వెనుక ఉన్న నేపథ్యం : మహాభారతం యుద్ధం ముగిసిన తర్వాత కౌరవులు, పాండవుల మధ్య జరిగిన ఈ మహాసంగ్రామం లో కౌరవులు పూర్తిగా నాశనం అవుతారు. గాంధారి కౌరవుల తల్లిగా తన వందమంది కుమారులను కోల్పోయిన బాధలో మునిగిపోయి ఉంటుంది. ఈ యుద్ధం లో శ్రీకృష్ణుడు పాండవులకు మార్గదర్శిగా, సలహాదారుడిగా ఉండి వారి విజయానికి కారణమయ్యాడని గాంధారి భావిస్తుంది ఆమె శ్రీకృష్ణుని దివ్య శక్తిని గుర్తించినప్పటికీ తన కుమారులు మరణానికి ఆయనే కారణమని భావించిన ఆవేశంలో శ్రీకృష్ణుడు ఆమె ఆశీర్వాదానికి వచ్చినప్పుడు ఆవేశంతో శాపం ఇచ్చింది.
గాంధారి శాపం: మహాభారతం ఇతిహాసంలో గాంధారి శ్రీకృష్ణుని ఈ విధంగా శపిస్తుంది. “ఓ కృష్ణ నీవు యాదవ వంశానికి నాయకుడివి నీ కుటుంబం, నీవు ఈ యుద్ధంలో నా కుమారులను నాశనం చేసినట్లే నీ యాదవ వంశం కూడ అంతర్గత కలహాలతో నాశనం అవుతుంది. నీవు కూడా ఒంటరిగా అసాధారణ మరణం పొందుతావు. ఆ సమయంలో నీవు ఎవరూ లేక ఒంటరిగా మరణం అనుభవిస్తావు” అని గాంధారి శపిస్తుంది. ఈ శాపం శ్రీకృష్ణుని జీవితంలోని ఒక మలుపును సూచిస్తుంది. ఎందుకంటే ఇది యాదవ వంశం యొక్క అంతం మరియు ఆయన జీవన యాత్ర ముగింపును నిర్దేశిస్తుంది.

శాపం ప్రభావం: గాంధారి శాపం శ్రీకృష్ణ జీవితం యాదవ వంశంలో ఎంతో ఘననీయమైన ప్రభావం చూపింది ఈ శాపం యొక్క పరిణామాలు యాదవ వంశం పూర్తిగా నాశనం అయ్యింది. మహాభారతం ప్రకారం గాంధారి శాపం కారణంగా యాదవ వంశం అంతర్గత కలహాలతో నాశనం అయ్యింది. యాదవులు మద్యం సేవించడం, అహంకారం గొడవల కారణంగా ఒకరినొకరు సంహరించుకుంటారు. ద్వారకలోని ప్రభాసక్షేత్రంలో ఈ సంఘటన జరుగుతుంది. ఇక్కడ యాదవులు తమ ఆయుధాలతో ఒకరినొకరు చంపుకుంటారు. ఈ సంఘటనతో శ్రీకృష్ణుడు జోక్యం చేసుకోలేదు ఎందుకంటే ఆయన గాంధారి శాపాన్ని గౌరవించాడు దానిని దైవ సంకల్పం గా స్వీకరించారని నమ్ముతారు.
గాంధారి శాపం ప్రకారం శ్రీకృష్ణుడు అసాధారణంగా మరణాన్ని పొందుతాడు. మహాభారతంలోని మౌసలాపర్వం ప్రకారం శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నప్పుడు ఒక వేటగాడు ఆయన పాదాన్ని జింక అని భావించి బాణంతో కొడతాడు. ఈ బాణం శ్రీకృష్ణుడి పాదానికి తగలడంతో ఆయన మరణిస్తాడు ఇది గాంధారి శాపం భావించబడుతుంది. శ్రీకృష్ణుడు ఒంటరిగా యాదవ వంశం నాశనం తరువాత మరణిస్తాడు.
శ్రీకృష్ణుడు తన జీవితంలో ధర్మాన్ని స్థాపించడానికి అనేక సవాళ్లు ఎదుర్కొన్నాడు. గాంధారి శాపం ఆయన లీలలు ఒక భావంగా భావించబడుతుంది. యాదవ వంశం నాశనం తర్వాత ద్వారక నగరం సముద్రంలో మునిగిపోతుంది. శ్రీకృష్ణుని జీవితం గాంధారి శాపం హిందూ సంప్రదాయంలో శాశ్వతమైన పాఠాలను నేర్పిస్తాయి.