సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కూతురు భారతి ఘట్టమనేని సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే భారతి లుక్ టెస్ట్ పూర్తయినట్లుగా సమాచారం అందుతోంది. కాగా, భారతి హీరోయిన్ గా నటించబోయే సినిమాకు తేజ దర్శకత్వం వహించనున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

అటు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ కూడా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా మహేష్ బాబు కుమార్తె సితార కూడా త్వరలోనే సినిమాలలోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. సితార ఎంతో అందంగా, కుందనపు బొమ్మలా ఉంటుంది. ఇప్పటికే సితార పలు యాడ్లలో నటించిన సంగతి తెలిసిందే. తనకు సమయం దొరికినప్పుడల్లా యాడ్ షూటింగ్ లలో చాలా చురుగ్గా పాల్గొంటుంది. సితార హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని మహేష్ బాబు అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.