బుధవారం అంటే వినాకుడు.. ఈరోజు వినాకుడిని భక్తితో పూజిస్తే ఎటువంటి కోరికలైన కూడా వెంటనే తీరతాయని పండితులు చెబుతున్నారు.. సర్వ రోగాలను కూడా నయం చేస్తాడు.. అందుకే ఏ శుభ కార్యంలో నైనా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. బుధవారం గణేశుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నమ్మకం. శివ పార్వతుల తనయుడు గణేశుడు శివునికి ఎంతో ప్రీతిపాత్రుడు. గణేశుడు బుధ గ్రహానికి కారక దేవుడు. వినాయకుడిని బుధవారం ప్రత్యేకంగా పూజిస్తారు. ఇలా చేయడం వలన అతనికి సంతోషం కలుగుతుంది. భక్తుల బాధలను తొలగిస్తుంది.. ఇక బుధవారం వినాయకుడును ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* . స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కనుక బుధవారం నాడు, గణేశుని ఆరాధన సమయంలో ఎర్రటి కుంకుమాన్ని తిలకాన్ని దిద్దండి. భక్తితో పూజించండి. ఇలా చేసిన భక్తునిపై వినాయకుని అనుగ్రహాన్ని కురిపిస్తాడు..
*. విఘ్నేశ్వరుడిని ఆరాధించే సమయంలో తప్పనిసరిగా గడ్డిని సమర్పించండి. దర్భలు అంటే గణేశుడికి అత్యంత ప్రీతిపాత్రం. కనుక గడ్డితో పూజిస్తే వినాయకుడు సంతోషిస్తాడు.. ప్రతి బుధవారం ఇలా వీటిని సమర్పిస్తే చాలా మంచిది..
*. శమీ మొక్క అంటే జమ్మి వినాయకుడికి చాలా ప్రీతికరమైనది. కావున బుధవారం రోజున వినాయకునికి తప్పనిసరిగా శమీ మొక్కల్ని సమర్పించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో సుఖ, సంపద, శాంతి కలుగుతాయి..
*.హిందూ మతంలో పూజ సమయంలో బియ్యాన్ని అక్షతలుగా సమర్పిస్తారు. ఎందుకంటే పూజలో అక్షతలు చాలా పవిత్రంగా భావిస్తారు. అదే సమయంలో గణేషుడికి అన్నం కూడా చాలా ఇష్టం. అయితే పొడి బియ్యాన్ని గణేశుడికి సమర్పించరాదు. గణేశుడిని పూజించే సమయంలో బియ్యాన్ని అన్నంగా లేదా పాయసం చేసి నైవేద్యంగా సమర్పించాలి. దీంతో సంతోషించిన గణేశుడికి తన భక్తులకు కోరిన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తాడు..
*. ఇక వినాయకుడుకి పండ్లను అటుకులను పూజ అనంతరం నైవేద్యంగా సమర్పించండి. అయితే బుధవారం వినాయకుడికి బెల్లం నైవేద్యంగా సమర్పించడం అత్యంత ఫలవంతం.. ధనం పెరుగుతుంది.. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి..