మేడ్చల్ జిల్లా పరిధిలోని బోడుప్పల్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లలో నేడు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, సహచర మంత్రి మల్లారెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఆయా మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.288.99 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు వారు బోడుప్పల్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.