బండి సంజయ్ అరెస్ట్: నేడు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందుకు సీపీ సత్యనారాయణ

-

బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంలో నేడు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు కరీంనగర్ సీపీ సత్య నారాయణ తో పాటు మరికొంత మంది పోలీస్ అధికారులు హాజరుకానున్నారు. గతంలో బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన సందర్భంలో ఎంపీగా తన హక్కులకు భంగం చేశారని బండి సంజయ్ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కమిటీ ముందు రాష్ట్ర సీఎస్, డీజీపీలు కూడా హాజరు కావాల్సి ఉన్నా… 5వ తేదీన ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా హాజరుకాలేమని అందుకు అనుమతి ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీకి చెప్పినట్లు సమాచారం. అందుకు ప్రివిలేజ్ కమిటీ అనుమతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

గత నెలలో 317 జీవో, ఉద్యోగుల బదిలీలపై జాగరణ దీక్ష చేస్తున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కరీంనగర్ కోర్ట్ రిమాండ్ విధించడం…దీనిపై హైకోర్ట్ స్టే విధించడం జరిగింది. అయితే ఆ సమయంలో పోలీసులు నాపై దాడి చేశారంటూ.. బండి సంజయ్ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అయింది. రాష్ట్ర సీఎస్, డీజీపీ, కరీంనగర్ సీపీ, ఇతర పోలీస్ అధికారులను తమ ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version