కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కొండన్నపల్లి గ్రామ శివారు వద్ద కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.