రామగుండం : ప్రమాదాన్ని గుర్తించి అక్కడున్న కార్మికులను అప్రమత్తం చేసి.. నలుగురిని దూరం పంపించి అదే ప్రమాదంలో సేఫ్టీ అధికారి చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఓ ఏరియా సేఫ్టీ అధికారి ప్రమాదంలో చిక్కుకోవడం సింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. విషయాన్ని అధికారులు కూడా నిర్ధారిస్తున్నారు. అనుకోని విధంగా ప్రమాదంలో చిక్కుకున్నాడని అతను క్షేమంగా బయటకు రావాలని అధికారులు కోరుకుంటున్నారు.