ATMలలో డబ్బు జమ చేసే వాహనం, నగదుతో డ్రైవర్ పరారైన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైటర్ సంస్థకు చెందిన వ్యాన్‌లో రూ.51 లక్షలతో శనివారం సురారంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదు జమ చేసేందుకు వచ్చారు. డబ్బులు జమ చేసేందుకు సిబ్బంది కిందికి దిగగా వ్యాన్‌తో సహా ఉడాయించిన డ్రైవర్ నర్సాపూర్ అటవీ ప్రాంతంలో వాహనాన్ని వదిలి అందులోని రూ.35 లక్షలు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.