అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..భర్తపై శానిటైజర్ పోసి నిప్పంటించిన భార్య

-

ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల కారణంగా.. క్రైమ్‌ రేటు విపరీతంగా పెరిగి పోతుంది. చాలా మంది హంతకులుగా మారిపోతున్నారు. తాజాగా అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..భర్తపై శానిటైజర్ పోసి నిప్పంటించింది ఓ భార్య. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెలికట్ట గ్రామ శివారు లోని పాల కేంద్రం వద్ద తాజ్ హోటల్ నిర్వాహకుడు షేక్ రహమత్ పాషా(35) నిద్రిస్తున్న సమయంలో భార్య రుక్సానా శానిటైజర్ పోసి నిప్పు అంటించింది.

పాప అరుపులు కేకలు విని… చుట్టు పక్కల వారు 108 వాహనం ద్వారా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి అతన్ని తరలించారు. అయితే.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. ప్రస్తుతంత ఎంజీఎం మార్చురీలో మృతదేహం ఉంది.

తన భార్య వేరే ఒకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని మందలించాడని కోపంతో భార్య ఈ ఘాతుకానికి ఒడిగట్టింది అని సమాచారం. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. అటు పరారీలో మృతుని భార్య ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన.. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version