సింగరేణి కార్మిక వర్గం పోరాటాలకు సిద్దం కావాలని AITUC ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ రామగుండం RG-2 డివిజన్ లోని OCP-3 సీహెచ్పీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక సమస్యల సాధనలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. గుర్తింపు కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వ కనుసన్నల్లో ఉండి కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు.
కార్మిక వర్గం పోరాటాలకు సిద్దం కావాలి: AITUC
-