పండుగ వేళ ప్రయివేటు వాహనాల అడ్డగోలు చార్జీలకు చెక్ పెట్టారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. 30 మంది కంటే ఎక్కువ వుంటే ఫోన్ చేస్తే చాలు బస్సు మీ ఇంటి వద్దకే వస్తుందని వెల్లడించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ ఆయన ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.