జనగామ బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగంపై ఉమ్మడి జిల్లా సహా రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. రాజ్యసభలో పీఎం తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు, అనంతరం రాష్ట్రంలో టీఆర్ఎస్ చేసిన నిరసనలు, జనగామలో TRS-BJP మధ్య ఘర్షణ నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. మోదీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర నాయకులందరూ స్పందించగా ఒక కేసీఆర్ మాత్రం స్పందించలేదు. దీంతో జనగామ సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.