తెలుగు చలనచిత్ర పరిశ్రమ సమస్యలపై నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డితో సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, పోసాని, నారాయణ మూర్తి ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని సమస్యలు, టికెట్ రేట్ల విషయంపై సీఎం జగన్ కు వివరించారు.
అయితే తాజాగా చర్చల సారాంశాన్ని వివరించేందుకు మంత్రి పేర్ని నాని.. మోహన్ బాబుతో భేటీ అయ్యారు. నిన్న సీఎంతో జరిగిన చర్చల గురించి.. తెలుగు ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి తీసుకున్న నిర్ణయాలను, అంశాలను గురించి మోహన్ బాబుతో చర్చించారు పేర్ని నాని.
తాజాగా ఈ అంశంపై మంచు విష్ణు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మంత్రి పేర్ని నానికి మా ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని..సీఎంతో చర్చల సారాంశాన్ని మంత్రి వివరించారని.. టిక్కెట్ ధరపై మీ చొరవతో పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కోసం ఏపీ ప్రభుత్వ ప్లాన్లపై మాకు వివరించినందుకు చేసినందుకు .. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రయోజనాలను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు అంటూ ట్విట్ చేశాడు.