ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 10 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 0, కరీంనగర్ 7, పెద్దపల్లి 3, సిరిసిల్ల జిల్లాలో 0 కేసులు నమోదైనట్టు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా కట్టడికి సహకరించాలని కోరారు.