పట్టణ కేంద్రంలోని అంజిరెడ్డి థియేటర్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మార్నింగ్ షో విరామ సమయంలో వీక్షకులు సిగరెట్ తాగి ఆర్పకుండా పడి వేయడంతో ప్రమాదం జరిగినట్లు ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల సహకారంతో మంటలను ఆర్పారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.