హైదరాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మహేశ్వరం మండల శాఖ నూతన భవన నిర్మాణ పనులను శనివారం డిసిసిబి చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, బ్యాంక్ సీఈవో శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. భవన నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. డిసిసిబి బ్యాంకు ద్వారా ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.