ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సంచలనం వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జగన్ పై మహిళలు చెప్పులు విసురుతారని హెచ్చరించారు. జగన్ పాలనలో మహిళలకు మాన ప్రాణలకు రక్షణ లేకుండా పోయింది..మైనర్ బాలికలను కూడా వైసీపీ నాయకులు వదలటం లేదని నిప్పులు చెరిగారు. 14 ఏళ్ల బాలిక పై అత్యాచారం జరిగి రెండు నెలలు గడిచిన ఇంత వరకు న్యాయం జరగ లేదు.. చిన్నారిపై వైసీపీ నాయకుడు కన్నా భూశంకర్ అత్యచారం చేసాడని ఆగ్రహించారు.
మైనర్ బాలికల అపహరణలో ఏపి రెండవ స్థానంలో ఉందని మండిపడ్డారు. హోంశాఖ మంత్రి సుచరిత నిస్సహాయ శాఖగా మంత్రిగా మారిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అత్యాచారం జరిగినా వైసీపీ నాయకులు హస్తం ఉంటుంది..అత్యచార బాధితురాలిని పరామర్శించడానికి వస్తే..ఆమెను లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. అమ్మయిని పరామర్శించడానికి ఆనుమతి ఇవ్వాలని పోలీసులుకు విజ్ఞప్తి చేస్తున్నామని… వైసిపి నేతలు బలహీన వర్గ మహిళలను టార్గెట్ చేశారన్నారు. మహిళా కమీషన్ చైర్మన్ ఉన్నారా లేదా అనే అనుమానం వస్తుందని.. రాష్ట్రంలో పరిశ్రమలు రాలేదుకాని గంజాయి, డ్రగ్స్ వచ్చాయని ఆమె తెలిపారు.