ఉమ్మడి మెదక్ జిల్లాను చలి వణికిస్తోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మూడు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌లో శనివారం 6.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. మెదక్ జిల్లాలోని శివ్వంపేట 7.7 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా సముద్రాలలో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు చలి ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.