కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.17 వేలు లంచం తీసుకుంటూ ఈఈ రామన్.. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అంతేకాకుండా ఏక కాలంలో ఈఈ రామన్‌కు సంబంధించిన హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్ ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
-