మొగిలిపాలెం: మర్రి కుమార స్వామికి చెందిన 5 పశువులు క్రిమి సంహారక మందు నీరు తాగి మృతి చెందాయి. పొలంలో వాడిన క్రిమి సంహారక మందు వర్షం కారణంగా కాలువ నీటిలో కలిసింది. ఈ నీటిని తాగడంతో కొద్దిసేపటికే మృతి చెందాయి. పశు వైద్యాధికారి పశువులను పరిశీలించారు. విషపూరితమైన నీరు తాగడంతోనే పశువులు మృతి చెందాయని ధ్రువీకరించారు. పశువుల మృతితో రూ.3 లక్షల నష్టం జరిగిందని బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యాడు.