ఒకటి, రెండు కాదు దాదాపు 40 నుంచి 60 వరకు నకిలీ ఖాతాలు సృష్టించి రుణం పేరుతో రూ. కోటి 15 లక్షలు కాజేసిన ఉదంతం జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. జగిత్యాల గ్రామీణ మండలం చల్గల్ యూబీఐ బ్యాంకులో పని చేసే సుమన్ అనే బ్యాంక్ మేనేజర్, క్లర్క్ రాజేశ్ ఈ భారీ మోసానికి పాల్పడినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. వీరిద్దరిపై జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయినట్టు ఎస్సై తెలిపారు.