ఇప్పటికే ప్రపంచం ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య జరుగుతన్న యుద్ధంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తాజా గా పాక్ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంగా మారింది. భారత క్షిపణి తమ భూ భాగంలోకి వచ్చిందంటూ పాక్ అధికారులు ప్రకటించారు. కాగ పాక్ అధికారుల ప్రకటనపై భారత సైనిక అధికారులు స్పందించారు. సాంకేతిక లోపం వల్ల ఈ నెల 9న భారత క్షిపణి.. పాక్ భూ భాగంలో దూసుకెళ్లిందని భారత అధికారులు వివరించారు.
ఈ ఘటనలో భారత్ కు చెందిన వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. కేవలం సాంకేతిక కారణాల వల్లే క్షిపణి పాక్ భూ భాగంలోకి దూసుకెళ్లిందని స్పష్టం చేశారు. ఈ ఘటన పై ఉన్నత స్థాయిలో దర్యాప్తు కూడా చేస్తున్నట్టు భారత సైనిక అధికారులు వెల్లడించారు. కాగ భారత ప్రకటన తో పాక్ తో సహా ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే పాక్ – భారత్ ల మధ్య సరిహద్దు వివాదాలు నడుస్తునే ఉన్నాయి. ఈ వివాదాన్ని సర్ధుమణిగించేందుకు యూఎన్‌వో తో పాటు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయినా.. ఫలితం దక్కడం లేదు.