మల్యాల మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా పని చేస్తున్న రజాక్ ఇటీవల, అదే గ్రామానికి చెందిన 5 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. ఘటనలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన ఘటన విధితమే. రజాక్ ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా పని చేస్తుండటంతో విచారణ జరిపిన అధికారులు సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు.