దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానాన్ని ఆదివారం తెలుగు సినీ నటి అర్చన శాస్త్రి సందర్శించారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ PRO ఉపాధ్యాయుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నాగిరెడ్డి మండపంలో ఘనంగా సన్మానించారు.