వాసు దేవుడి బ్రహ్మోత్సవాల్లో బ్రేక్ డాన్సులు చేసిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని చారిత్రక ప్రాముఖ్యత గల శ్రీ వాసుదేవ పెరుమాళ్ 16వ వార్షిక బ్రహ్మోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా స్వామి వారిని పల్లకిలో ఊరేగించారు. ఆ సమయంలో అర్చకులు కొందరు భక్తి పారవశ్యంతో చప్పట్లు కొడుతూ డ్యాన్స్ చేయగా.. ఓ అర్చకుడు మాత్రం ఒళ్లుమరిచి ఏకంగా బ్రేక్ డ్యాన్సులు వేసి తన టాలెంట్ చూపించారు. స్వామి వారి ఊరేగింపులో ఈ చిందులు ఏంటని కొందరు మండిపడుతున్నారు. దేవుడి వేడుకల్లో ఇవేం పిచ్చి డాన్సులు అంటూ విమర్శలు చేస్తున్నారు.
వాసు దేవుని బ్రహ్మోత్సవాల్లో బ్రేక్ డాన్సులు..
శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని చారిత్రక ప్రాముఖ్యత గల శ్రీ వాసుదేవ పెరుమాళ్ 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు
బ్రేక్ డాన్యులతో స్వామి వారి ఊరేగింపు
దేవుడి వేడుకల్లో ఇవేం పిచ్చి డాన్సలు అంటూ విమర్శలు pic.twitter.com/Wv26qy6pyI
— BIG TV Breaking News (@bigtvtelugu) February 25, 2025