సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 20న సాయంత్రం ప్రారంభమైన జ్వర సర్వే ఆదివారం సాయంత్రంతో ముగిసిందని వైద్య అధికారిని గాయత్రి దేవి తెలిపారు. సర్వేలో భాగంగా జిల్లాపరిధిలో ఇంటింటికీ తిరిగి, కరోనా స్వల్ప లక్షణాలు కలిగిన వారికి వైద్య ఆరోగ్య సిబ్బంది కిట్లు అందజేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ అపోహలను వీడి తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.