మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కాశగుట్ట మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ నెల 14, 15 తేదీలలో నిర్వహించనున్న మల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలకు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు యాదవ సంఘం సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. కళ్యాణ మహోత్సవంతోపాటు బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.