మేడారం సమ్మక్క- సారలమ్మ దేవతలను శనివారం మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు దర్శించుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క- సారలమ్మ తెలంగాణలోనే ఉండటం మనందరికీ గర్వకారణం అని, స్వరాష్ట్రంలో నాలుగు సార్లు వైభవంగా జరిగిన మేడారం జాతర నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ అధికంగా నిధులు విడుదల చేశారని వారు అన్నారు.