నల్గొండ: చిన్న జీయర్ స్వామిపై ఫిర్యాదు

చిన్న జీయర్ స్వామిపై కేసు నమోదు చేయాలని నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు చెరుకు లక్ష్మీ ఫిర్యాదు చేశారు. మాంసాహారులపై చిన్న జీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాంసాహారులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.