
మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనదారుడు అదుపు తప్పి ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడి మృతి చెందిన ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి జరిగింది. సాలార్ జంగ్ కాలనీకి చెందిన మహమ్మద్ సర్ఫరాజ్ హుస్సేన్(18) అదే కాలనీలో మెడికల్ షాప్‌లో పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి బుల్లెట్ బైక్‌పై టోలిచౌకి వంతెన మీదుగా షేక్‌పేట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.