SLBC ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలి అనే పట్టుదలతో ఉన్నాం : సీఎం రేవంత్

-

SLBC త్వరగా పూర్తి అయితే ఫ్లోరైడ్ రహిత నల్గొండ ను చూడాలి అనుకున్నాం. కానీ గత ప్రభుత్వం బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో పదేళ్లుగా పనులు నిలిచిపోయాయి అని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఈ ప్రాజెక్ట్ ను పునః ప్రారంభించాం. నిపుణులు అందరితో చర్చించే.. పనులు స్టార్ట్ చేశాం. అనుకోకుండా దుర్ఘటన జరిగింది. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా సానుభూతి తెలపాలి.

ఇది ఒక ప్రమాదం.. ఇది విపత్తు.. అందరం కలిసి సానుభూతి ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే.. హెలికాప్టర్ ఇచ్చి మంత్రులు జూపల్లి, ఉత్తమ్ లను ఇక్కడికి పంపాను. ఎప్పటికప్పుడు రెస్క్యూ సమాచారం తెలుసుకున్నాను. 8 కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం. గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ లో ప్రమాదం జరిగితే.. నేను వచ్చే ప్రయత్నం చేసాను. నన్ను అడ్డుకుని అరెస్ట్ చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఎలా ఐనా సరే.. ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలి అనే పట్టుదలతో ఉన్నాం. అధునాతన సాంకేతిక తో రెండు వైపుల నుంచి టన్నెల్ పనులు జరుపుతున్నాం అని సీఎం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version