KCR అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం : KTR

-

కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకువచ్చి మల్కపేట రిజర్వాయర్ లో పోస్తే.. దేవుని గుట్ట తండాలోని రైతులు వ్యవసాయం చేశారు. కేసీఆర్ మీద ఉన్న కోపం, ద్వేషంతో మేడిగడ్డ లో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపించడంతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి అని కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రాంతంలోని చాలామంది రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు.

కాళేశ్వరం నీళ్లు రాక తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లోనూ వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లింది. కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేడిగడ్డ పర్రెను రిపేర్ చేసి నీళ్లు ఇవ్వవచ్చు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు మండు వేసవిలో ఎర్రటి ఎండల్లో కూడా సిరిసిల్ల జిల్లాలోని అప్పర్ మానేరు ముత్తడి దుంకింది. మిడ్ మానేరు అప్పర్ మానేరు నింపడంతో ఎర్రటి ఎండల్లో కూడా వాగులు చెర్లను నింపి రైతులను కాపాడుకున్నం అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version