క్రెడిట్ కార్డ్ పేరుతో మోసాలు.. ముఠా అరెస్ట్

క్రెడిట్ కార్డుల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను గురువారం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి ఏటీఎం కార్డులు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.