ఉమ్మడి మెదక్: రేగోడ్ పీఆర్ ఏఈకి సర్పంచ్ భర్త లంచం..? వైరల్

-

రేగోడ్ మండల పీఆర్ ఏఈ ఈశ్వర్ నాయక్‌ కారులో ఉండగా గజ్వాడ సర్పంచ్ భర్త మానెప్ప అతనికి డబ్బులు ఇస్తున్న వీడియో మండలంలో వైరల్ అయింది. ఈ విషయమై స్థానికంగా విపరీతమైన చర్చ జరిగింది. సర్పంచ్ భర్త ఏఈకి ఇస్తున్న డబ్బులు కచ్చితంగా లంచం అని కొందరు భావించారు. ఈ క్రమంలో సర్పంచ్ భర్త చేతి బదలు ఇచ్చానని చెప్పడం, ఏఈ ఈశ్వర్ నాయక్ డబ్బులు అసలు తీసుకోలేదని తిరిగి ఇచ్చేశానని పొంతన లేకుండా చెప్పడం సందేహాలకు తావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news